Thursday, 1 September 2011

కమల హాసన్ కూతురుకి మణిరత్నం ఆఫర్!

 
 
                 విలక్షణ నటుడు కమల హాసన్ కూతుర్లు శృతి హాసన్, అక్షర హాసన్ తండ్రికి తగ్గట్టుగా తమ ప్రతిభను చాటుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. పెద్దమ్మాయి శృతి తెలుగు, తమిళ చిత్రాలలో ఇప్పటికే కథానాయికగా నటిస్తూ బిజీగా వున్న సంగతి మనకు తెలుసు. చిన్నమ్మాయి అక్షర ఇప్పటి వరకు ఫిలిం టెక్నికల్ సైడు వుంది. ఇప్పుడీ అమ్మాయి కూడా కథానాయికగా మారుతోంది. గత కొంత కాలంగా మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తూ వున్న అక్షరకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. తమిళ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ ని పరిచయం చేస్తూ మణిరత్నం రూపొందిస్తున్న 'పూకడై' చిత్రంలో అక్షరను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశాడట. ఇదే చిత్రాన్ని రణబీర్ కపూర్ హీరోగా హిందీలో కూడా ఏకకాలంలో నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment